Content feed Comments Feed

జై శ్రీరామ్
జై హనుమాన్

  1. బృహస్పతి భార్య తారకు బృహస్పతి శిష్యుడైన చంద్రుడికి పుట్టినవాడు బుధుడు. మనువుకుమారుడైన సుద్యుమ్నుడు ఒక కొలనులో స్నానము చేయగా స్త్రీగా మారిపోయెను ఆమె పేరు ఇల. ఆమెను బుధుడు చూచి వివాహమాడెను. వారిరువురకు కలిగిన కుమారుడు పురూరవుడు. బృహస్పతి నవగ్రహాలలో ఒక గ్రహం. తార అనేది నక్షత్రం బుధుడు నవగ్రహాలలో ఒక గ్రహం. ఆ బుధుడి కుమారుడు మాత్రం మనిషే షట్చక్రవర్తులలో ఒకడైన పురూరవుడు. నమ్మబుద్ధికావటం లేదు కదూ.... కానీ అదే నిజం.
  2. స్వధ కూతురు మేనక. ఆ మేనకను హిమవంతుడు వివాహమాడెను. మేనకా హిమవంతులకు పార్వతి పుట్టి తపస్సు చేసి శివుని మెప్పించి వివాహమాడెను. హిమవంతుడంటే హిమాలయ పర్వతములు. ఈ పర్వతములు పితృదేవతల కూతురైన మేనకను వివాహమాడటం వారికి సంతానంగా పార్వతి పుట్టటం శివుణ్ణి పెళ్ళి చేసుకోవటం అంతా తమాషాగా ఉందా. కానీ అదే నిజం.
  3. మన వేదాలూ పురాణాలూ వట్టి పుక్కిటి పురాణాలని పసలేనివని కాలక్షేపం కోసం రచించినవనీ మనచేతనే పలికించగలిగిన పాశ్చాత్య దేశాల విద్యావిధానములు భారతీయ సంస్కృతిని చరిత్రను పురాణాలను ఇతిహాసాలను పరిహాసం చేస్తుంటే ఆత్మాభిమానం కోల్పోయి మనకన్నా వారే గొప్ప అని భావించే వారందరికీ ఒక విజ్ఞప్తి. ఒకసారి డిసెంబరు 6 వ తేది. 2010 సోమవారం నాటి ఈనాడు దిన పత్రికలో వచ్చిన ఒక వార్తను చదవండి. హెడ్డింగ్:- ప్లాస్మా ఆవిష్కరణ.

ఈ అనంత విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు సూర్యచంద్రులు, పర్వతాలు, భూమ్మీద జీవులుగా ఎలామారారో తెలియక ఆశ్చర్యపోతూ తమ పరిశోధనలను కొనసాగిస్తున్న పాశ్చాత్యదేశపు శాస్త్రజ్ఞులను చూస్తే జాలేస్తోంది. ఇంతకాలం మనల్ని మన పురాణాలను మన ఆచారాలను హేళన చేస్తూ ఆటపట్టించిన ఈ పాశ్చాత్య దేశపు శాస్త్రజ్ఞులు అవే నిజమని తమ పరిశోధనల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. పైన చెప్పిన విషయాలన్నీ పచ్చి నిజాలు. అవే కాదు ఇంకా కూడా చూడండి.

జరాసంధుని బారి నుండి యాదవులను రక్షించుటకై కృష్ణుడు 5200 సంవత్సరాల క్రితమే సముద్రంలో అద్భుతమైన భవనాలతో రాతి కట్టడాలతో ఒక నగరాన్నే నిర్మించటం వీళ్ళు చెబుతున్న సైన్సుతోనో, టెక్నాలజితోనో కాదు. వేద విజ్ఞానంతో. నాసావాళ్ళు తమ ఉపగ్రహాలతో సముద్ర గర్భంలోని ఈ మహానగరాన్ని గుర్తించి, అప్పటికే మనకున్న విజ్ఞానానికి ఆశ్చర్యపోతున్నారు....చుట్టు పక్కల ఎక్కడా కూడా కొండలు బండలు లేని ప్రాంతమైన రామేశ్వరం వద్ద పెద్ద పెద్ద బండలతో సముద్రపు ఈకొననుండి ఆకొనవరకు ఏకంగా వారధినే కట్టించిన శ్రీరామ చంద్రమూర్తి వీళ్ళ సైన్సు టెక్కాలజీలు చదువలేదు. వేదాధ్యయనమే చేశారు.

శ్లో|| అంబితమే నదీతమే దేవితమే సరస్వతి| అప్రశస్తాఇవశ్మసి ప్రశస్తిమ్ అంబనస్కృథి|| సరస్వతి నదిని స్తుతిస్తున్న మంత్రమిది.

ఋగ్వేదంలో సుమారుగా 50 చోట్ల సరస్వతీనది ప్రస్తావన ఉంది. కానీ అటువంటి నది ఏదీ భూమ్మీద ఏనాడూ కూడా లేదనీ, పురాణాల్లోని విషయాలన్నీ అసత్యాలనీ, మనల్ని ఇంతకాలం హేళన చేసినవారు ఈనాడు నాసావారు చెప్తున్న విషయాల్ని విని నోళ్ళు మూసుకున్నారు. నాసావారు చెప్పాక ఇస్రోవారు కూడా పరిశోధించి సరస్వతీనది ఒకటి ఉండేదనీ అది పురాణాల్లో చెప్పినట్లుగానే 14 మైళ్ళ వెడల్పుతో ప్రవహించేదనీ ఏ కారణం చేతనో భూమ్మీద నుండి మాయమై అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవహిస్తున్నదని తెలియజేశారు. ఈ సరస్వతీ నదీ జలాలను పైకి తేగలిగితే రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంత మంతా సస్యశ్యామలంగా మారిపోతుందని సైంటిస్టులు చెప్తున్నారు.
(సశేషం...)
డిసెంబరు 6 వ తేది. 2010 ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త.

 
సేకరణ: గచ్చిబౌళిలోని వినాయకనగర్‌లో వెలసిన శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం వారు పంచిన కఱపత్రం నుంచి.

1 Responses to ధర్మ సంస్థాపనార్థాయ - 1

  1. Unknown Says:
  2. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

     

Post a Comment